Image

 

టీ / తేనీరు ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో  ప్రతి రోజు త్రాగే  పానీయం

ఈ టీ లలో ఎన్నో రకాల టీ లు మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి , ఇప్పుడు మనమందరం ఆరోగ్యం మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాం కావున ఈ టీ లలో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో టీ లు ఉన్నాయి దాంట్లో గ్రీన్ టీ అనేది చాల ప్రముఖమయినది .
గ్రీన్ టీ కి పుట్టినిల్లు చైనా , ఇక్కడినుండి అన్ని దేశాలకు విస్తరించింది ,
ఇప్పుడు ఆహార నిపుణులు కూడా గ్రీన్ టీ ని నియమబద్ధంగా  తాగమని చెప్తున్నారు ,
గ్రీన్ టీ అనేది గ్రీన్ టీ యొక్క ఆకుల నుండి తయారుచేస్తారు , ఇప్పుడు ఈ గ్రీన్ టీ వల్ల మన ఆరోగ్యానికి ఏమేమి లాభాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం .

గ్రీన్ టీ లో ఉన్న మూలకాలు :

1 కాటెచిన్స్ ( ఎపిగాళ్ళ కాటెచిన్స్-3 గల్లెట్ - EGCG )
2  కెఫిన్
3  థయామిన్
4 విటమిన్స్  (సి , B 2 , ఫోలిక్ ఆసిడ్ , బీటా కెరోటిన్ , విటమిన్ ఈ)
5 సపోనిన్స్
6 ఫ్లోరిన్
7 మినరల్స్ : (పొటాషియం , క్యాల్షియం , ఫాస్పరస్ , & మాంగనీస్)
ఇంకా మరెన్నో పోషకాలు దీంట్లో ఉన్నాయి

గ్రీన్ టీ యొక్క లాభాలు :

1  వెయిట్ లాస్  :

దీంట్లో ఉండే బయో ఆక్టివ్ పదార్థాలు  వల్ల శరీరం లో ఉండే క్రొవ్వు కరిగించబడుతుంది
గ్రీన్ టీ జీవ క్రియ రేటు ను తక్కువ కాలం లో మెరుగు పరిచి  ఎక్కువగా ఉన్న క్రొవ్వును  కరిగిస్తుంది.
గ్రీన్ టీ ని తాగడం వల్ల ముఖ్యంగా పొట్ట క్రింది భాగం లో ఉండే  క్రొవ్వు కరుగుతుంది
దీనిలో ఉండే కెఫీన్ కూడా బరువు తగ్గడం లో ఉపయోగ పడుతుంది , ఈ  కెఫీన్ మన  మెదడుకు కొంత ప్రశాంత ను ఇస్తుంది .
అందుకే మనం కాఫీ కానీ గ్రీన్ టీ తాగిన వెంటనే ప్రశాంతంగా ఉన్న అనుభూతుని పొందుతాము .

2.డయాబెటిస్ / మధుమేహం :

కొన్ని గణాంకాల ప్రకారం గ్రీన్ టీ టైపు 2 మధుమేహాన్ని నియంత్రిస్తుంది
గ్రీన్ టీ  త్రాగడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ తగిన స్థాయిలో ఉంటాయి ,

3  క్యాన్సర్ :

దీనిలో ఉండే కాటెచిన్స్  మరియు మరి కొన్ని పోషకాలు క్యాన్సర్ రాకుండా పోరాడతాయి మరియు క్యాన్సర్ కణాలను పెరగనీయవు
గ్రీన్ టీ శక్తివంతమయిన అనామ్లజనకాలను కలిగిఉంది ఇవి కాన్సర్ రాకుండా పోరాడతాయి

4  చర్మానికి :

గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం మీద చిన్న వయసులో వచ్చే ముడతలు రావు , చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది , వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది ,
దీనిలో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఈ ఇందుకు తోడ్పడుతాయి .ఎండవల్ల చర్మం  కమిలి పోకుండా మనను కాపాడుతుంది
మొత్తం గా  చెప్పాలంటే చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది
హార్వర్డ్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ హోవార్డ్ సేసో గ్రీన్ టీ  మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని పేర్కొన్నాడు

5 మెదడుకు :

బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్  వారి ప్రకారం గ్రీన్ టీ లో ఉండే EGCG
కాటెచిన్స్  అనే కాంపౌండ్  మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది , వయసు ప్రకారం వచ్చే  సమస్యలయిన  అల్జిమెర్స్ , దమెంతియ మరియు   పార్కిన్సన్స్  నుండి కాపాడుతుంది .

6 నోటి ఆరోగ్యం :

గ్రీన్ టీ  తరచుగా తాగడం వల్ల నోటి దుర్వాసనని అరికట్టవచ్చు గ్రీన్ టీ  లో ఉండే కాటెచిన్స్ కు బ్యాక్టీరియా ని  అడ్డుకుని నోటి ఆరోగ్యాన్ని కాపాడే గుణం ఉంది

7 రక్త పోటు : ( బ్లడ్ ప్రెషర్ )

ఈ రోజు ల లో  అధిక రక్త పోటు & అల్ప రక్త పోటు అనేది  సామాన్యంగా ఉండే ఆరోగ్య సమస్య ,
ఈ సమస్యకు  గ్రీ టీ అనేది నిపుణులు చెప్తున్న దాని ప్రకారం  అధిక రక్త  మరియు అల్ప రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది .

8 గుండె ఆరోగ్యానికి :

ప్రపంచం మొత్తం మీద కొన్ని మిలియన్ల మంది గుండెకు సంబందించిన వ్యాధులతో బాధపడుతున్నారు , మరణాల రేటు కూడా వీటిదే ఎక్కువ ,
గుండె జబ్బులు రావడానికి ముఖ్యకారణాలు  , జీవనశైలి మారడం , అధిక పని ఒత్తిడి , ఊబకాయం , కాలుష్యం  ఇంకా ఎన్నో ...
గ్రీన్ టీ లో ఉండే అనామ్లజనకాలను (యాంటీఆక్సిడాంట్స్)  , విటమిన్ సి , విటమిన్ ఈ , సపోనిన్స్ ఇంకా ఎన్నో మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి ,
గుండెకు హాని చేసే చెడు క్రొవ్వులను (చెడు కొలెస్ట్రాల్ ) ను అడ్డుకుంటుంది , అందుకే గ్రీ
న్
టీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది .
ఇన్ని లాభాలున్నగ్రీ టీ ని ఎలా త్రాగాలొ తెలుసుకుందాం .

గ్రీన్ టీ ని  ఎప్పుడు త్రాగాలి :

  • ఉదయము 10 గం - 11 గం మధ్యలో
  • మధ్యాహ్నం 2 గం లకు లేదా సాయంత్రం 4 గం
  • వ్యాయామానికి 30 నిమి//  లేదా 1 గం  ముందు
  • భోజనానికి 2 గం ల ముందు గాని లేదా తరవాత గాని
  • రాత్రి పడుకునే ముందు త్రాగరాదు

green tea timings

గ్రీన్ టీ ని ఎన్నిసార్లు త్రాగాలి :

గ్రీన్ టీ ని దినం లో 3 సార్లు త్రాగవచ్చు  ఇంత కన్నా ఎక్కువ సార్లు త్రాగితే  అసిడిటీ , కడుపులో  మండటం గా ఉంటుంది

గ్రీన్ టీ లో రకాలు :

గ్రీన్ టీ లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి అన్నింటిలో  గ్రీన్ టీ తో పాటు మిగతా పదార్థాలు ఉంటాయి.

  • లెమన్ గ్రీన్ టీ
  • తులసి గ్రీన్ టీ
  • హనీ గ్రీన్ టీ
  • అల్లం గ్రీన్ టీ
  • బంతి పువ్వుల గ్రీన్ టీ
  • అశ్వగంధ గ్రీన్ టీ

ఇంకా ఎన్నో రకాలు ఆన్లైన్ లో కానీ దుకాణాలలో అందుబాటులో ఉంటాయి
గ్రీన్ టీ ని పాలతో కలిపి త్రాగరాదు

గ్రీన్ టీ తయారీ  విధానం :

శుభ్రమయిన మరిగే నీటిలో  గ్రీన్ టీ ఆకులను కానీ పొడి ని కానీ వేసి 3 ని మి// మరిగించాలి పంచదార కి బదులు తేనె వేసుకుని త్రాగాలి .
గ్రీన్ టీ బ్యాగ్స్ ని వేడి నీటిలో ఉంచి టీ బ్యాగ్స్ తీసివేసి త్రాగాలి


ఇన్ని లాభాలున్న గ్రీన్ టీ త్రాగడాన్ని ఈరోజు  నుండే ప్రారంభించండి , వీలయితే ఒక సారి మి డాక్టర్ సలహా కూడా తీసుకోండి .

Add new comment

Enter the characters shown in the image.
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.

Home