Image


ప్రపంచం మొత్తం మీద అత్యధిక మంది బాధపడుతున్నది గుండె కు సంబందించిన వ్యాధుల తోనే .
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరం దాదాపు 17 . 9 మిలియన్ మరణాలు (CVD ) కార్డియో వాస్క్యూలర్ డిసీసెస్ వల్ల సంభవిస్తున్నాయి .

 

గుండె నొప్పి (హార్ట్ ఎటాక్ ) అంటే ఏమిటి ?

గుండె కు  (హార్ట్) కు వెళ్లే  రక్తం ( బ్లడ్) సరఫరా తగినంతగా  వెళ్లలేనపుడు  లేదా అసలే వెల్ల లేనపుడు గుండె నొప్పి వస్తుంది , ఈ నొప్పికి కారణం  గుండె కు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో చెడు క్రొవ్వు పేరుకు పోయి అవి గట్టిగా  సన్నగా అవటం వల్ల మన గుండెకు తగినంత రక్తాన్ని తీసుకుని వెల్ల లేవు అప్పుడు గుండెకు కావలసిన ఆక్సిజెన్ అందక మనకు తీవ్రమయిన గుండె నొప్పి వస్తుంది ఇది కొన్ని సార్లు మరణానికి కూడా దారి తీయవచ్చు.

హార్ట్ ఎటాక్ ను మయో కార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని కూడా అంటారు .

గుండె నొప్పి లక్షణాలు : (Heart Attack Symptoms in Telugu ) :

  • మన చాథీ లో , బాహువులలో , గుండె దగ్గర , బ్రెస్టుబోన్ (ఉరోస్థి ) ల లో అసౌకర్యంగా అనిపించడం ,ఒత్తిడి గా అనిపించడం ,బరువుగా , బిగుతుగా మరియు నొప్పి గా అనిపించడం.
  • ఛాతి వెనకాల , దవడ లో , గొంతు లో అసౌకర్యంగా అనిపించడం
  • కడుపు నిండినట్టుగా అనిపించడం , తిన్నది సరిగా అరగక పోవడం మరియు గుండె లో మంట.
  • చమటలు పట్టడం , కడుపులో అసౌకర్యంగా ఉండటం , ఊపిరి సరిగా ఆడకపోవడం
  • బలహీనంగా అనిపించడం ,ఆతృతగా గా ఉండటం ,అలసటగా గా అనిపించడం
  • శ్వాశ తీసుకోవడం లో ఇబ్బంది మరియు గుండె వేగంగా కొట్టుకోవడం


ఈ యొక్క లక్షణాలు ప్రతి వ్యక్తికి  వేరే లాగా కూడా ఉండొచ్చు మరియు మహిళలకు వేరే లాగా ఉండొచ్చు.
 

Meditation

గుండె నొప్పి రావడానికి కారణాలు  మరియు నివారణ :

చెడు క్రొవ్వులు , కొన్ని రకాల ప్రోటీన్స్ , కాల్షియమ్ వంటి వాటి వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నగా అయిపోవడం లేదా మూసుకు పోవడం అనేది గుండె నొప్పికి దారితీస్తుంది.

  • ధూమపానాన్ని మానేయడం
  • జంక్ ఫుడ్ ని తినవద్దు
  • ఎక్కువ సేపు కూర్చోవద్దు

 (ప్రతి 30 ని .మి // ఒక సరి లేచి నడవాలి )

  • ఉప్పు వాడకాన్ని ఆహారం లో తగ్గించాలి
  • రక్త పోటు (High BP ) ను అదుపులో ఉంచుకోవాలి
  • మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి
  • ఆరోగ్య కరమయిన శరీర బరువు కలిగి ఉండాలి
  • ప్రతి రోజు నడక లేదా వ్యాయామం తప్పక చేయాలి
  • చెడు కొలెస్టరాల్ ఉండకుండా చూసుకోవాలి
  • ఆల్కహాల్ ని మోతాదులో తీసుకోవాలి లేదంటే మొత్తానికే మానేయాలి
  • మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి
  • గుండె ఆరోగ్యానికి సంబందించిన ఆహారాన్ని తీసుకోవడం
  • తగినంత నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి .
  • కాలుష్యానికి దూరంగా ఉండాలి


గుండె నొప్పికి మన యొక్క వయస్సు మరియు మన ఇంట్లో వాళ్ళ యొక్క కుటుంబ చరిత్ర కూడా  ఒక కారణమే అందుకే మీకు పై లక్షణాలు ఉంటె ఒక సారి మీ డాక్టర్ ని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
ఈ రోజుల్లో గుండె జబ్బును ముందే పసిగట్టే ఎన్నో రకాల  పరీక్షలు అందుబాటులో ఉన్నాయి వాటిని వినియోగించుకోవాలి  .

 

గుండె ఆరోగ్యానికి ఏమి తినాలి :


1. ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ : గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ చాల సహకరిస్తాయి , ఇవి చేపలలో ( టున మరియు హెర్రింగ్ అనే చేపలు ) , అవిసె గింజలలో , సబ్జా గింజలలో మరియు  సొయా గింజలు .

2 . బాదాం మరియు అక్రోట్లు : వీటిలో విటమిన్ ఈ మరియు ఎన్నో పోషకాలు ఉంటాయి , ప్రతి రోజు వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యముగా  ఉంటుంది


3 . అన్ని రకాల ఆకు కూరలు కూరగాయలు : ఆ కాలం లో లభించే అన్ని రకాల ఆకు కూరలు కూరగాయలు తప్పకుండ తినాలి , వీటి వల్ల మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి .

4 .ఓట్స్ : ఓట్స్ మన గుండె ఆరోగ్యానికి అద్భుతమయిన ఆహారం వీటిల్లో ఉండే పీచు పదార్థము గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

5 . పండ్లు : బెర్రీ పండ్లు , కమలాలు , బత్తాయి ,అరటి ,నిమ్మ , దానిమ్మ , పుచ్చకాయ , రేగు పండ్లు , జామ, మామిడి

ఈ పండ్లు తినడం వల్ల చెడు కొలెస్టరాల్ పేరుకుపోయే అవకాశం ఉండదు , మరియు వీటిల్లో గుండె ఆరోగ్యం కోసం ఉపయోగపడే  విటమిన్ సి మరియు ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి .

6 . గ్రీన్ టీ : దీంట్లో ఉండే యాంటీఆక్సిడాంట్స్ మన గుండెను కాపాడతాయి
7 . మొలకెత్తిన విత్తనాలు
మొలకెత్తిన పెసలు , సెనగలు ఇంకా ఇతరాలు
8 . డార్క్ చాక్లెట్
9 . ఇతర ఆహార పదార్తాలు
టమాటాలు , పసుపు , మిరియాలు , దాల్చిన , లవంగము ,నిమ్మకాయలు,క్యారెట్స్ ,బీట్రూట్  మొదలగునవి తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది

మధుమేహం ఉన్న వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు డాక్టర్ సలహా లేదా ఆహార నిపుణుల సలహా ప్రకారం తీసుకోవాలి .

ఇంకా గుండె ఆరోగ్యానికి సంబందించిన సమాచారం కోసం 
https://www.plus100years.com/arogya-sutralu లోని ఆరోగ్య సూత్రాలు చూడండి

మీ యొక్క సూచనలు సలహాలు ఇక్కడ రాయండి

జాగ్రత్తగా ఉండండి - మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Add new comment

Enter the characters shown in the image.
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.

Home